విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, వారికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని BRS రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం హన్మకొండలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
విద్యుత్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వారికి తగిన గౌరవం కల్పించాలని కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వారి సంక్షేమానికి కృషి చేయాలని పేర్కొన్నారు.


