వచ్చేసింది.. వచ్చేసింది.. కోట్లాదిమంది రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేసిన “పెద్ది” సినిమా ట్రైలర్ వచ్చేసింది. నిజానికి “పెద్ది” సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ జూన్ 4వ తేదీ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా. ఉప్పెన మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో హీరోయిన్ గా జాన్వి కపూర్ కాంబోలో వస్తున్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ “పెద్ది”.
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అలాగే సుకుమార్ రైటింగ్ సమర్పణలు వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో సందడి చేయడానికి రెడీ అయిపోయింది “పెద్ది”. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొద్దిసేపటి క్రితమే “పెద్ది” ట్రైలర్ ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. పెద్ది ట్రైలర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత అద్భుతంగా ఉంది. నో డౌట్ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం పక్క అంటూ ఫ్యాన్స్ అప్పుడే ధీమా వ్యక్తం చేసేస్తున్నారు.
“ఆటే నా పొగరు” అనే డైలాగ్ రామ్ చరణ్ నోట వినడం ఇంకా ఇంకా హైలైట్ గా మారింది. “మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు..కానీ నేను పోరాడాను సార్” అనే డైలాగ్ ఇంకా ఇంకా హైలైట్ గా మారింది. ఇక జాన్వి కపూర్ అందాలు సినిమాకి మరొక ప్లస్ గా మారబోతున్నాయి. బుచ్చిబాబు సానా డైరెక్షన్ వేరే లెవెల్ అనే చెప్పాలి. సీన్స్ ట్రైలర్ లోనే ఈ విధంగా ఉంటే సినిమా థియేటర్లో ఇంకెలా ఉండబోతుందో అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు .
మొదటి నుంచి “పెద్ది” సినిమా గురించి జనాలు చాలా చాలా ఎక్కువగానే ఊహించుకున్నారు . అందుకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లోనే బుచ్చిబాబు సానా ఈ సినిమాను డైరెక్టర్ చేసినట్లు చిన్న ట్రైలర్ ద్వారానే తెలిసిపోతుంది. అయితే రామ్ చరణ్ అంటే మామూలు హీరో కాదు గ్లోబల్ ఇమేజ్ ఉన్న హీరో. ట్రైలర్ చూసిన తర్వాత కొంతమంది మాత్రం ఈ సినిమా గ్లోబల్ ఇమేజ్ రేంజ్ లో ఉండదేమో అని సందేహ పడుతున్నారు. కానీ, రాంచరణ్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం పక్క.. బాక్స్ ఆఫీస్ చరిత్ర తిరగరాస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు సినిమా కథ ఏంటి..? రాంచరణ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది..? బుచ్చిబాబు సానా ఏ విధంగా ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు..? అని తెలియాలి అంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే. అయితే ఈ లోపు మాత్రం పెద్ది ట్రైలర్ ఒక సెన్సేషన్ సృష్టిస్తుంది అనడంలో సందేహమే లేదు . ఇప్పటి వరకు ఉన్న యూట్యూబ్ రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టే రేంజ్ లో రాంచరణ్ ఫ్యాన్స్ ఈ “పెద్ది” ట్రైలర్ ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారు. మరెందుకు ఆలస్యం గూస్ బంప్స్ తెప్పించే రాంచరణ్ “పెద్ది” సినిమా ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాని కామెంట్ రూపంలో తెలియజేయండి..!!
పెద్ది సినిమా పూర్తి వివరాలు
| వివరం | సమాచారం |
|---|---|
| చిత్రం పేరు | పెద్ది |
| హీరో | రామ్ చరణ్ |
| హీరోయిన్ | జాన్వి కపూర్ |
| దర్శకుడు | బుచ్చిబాబు సానా |
| నిర్మాతలు | వెంకట సతీష్ కిలారు |
| బ్యానర్ | మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ |
| జానర్ | రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా |
| రిలీజ్ డేట్ | జూన్ 4, 2026 |
FAQ’s
Q1. పెద్ది సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు?
పెద్ది సినిమా జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతోంది.
Q2. పెద్ది మూవీలో హీరోయిన్ ఎవరు?
జాన్వి కపూర్ పెద్ది చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Q3. పెద్ది సినిమా దర్శకుడు ఎవరు?
ఉప్పెన సినిమా ఫేమ్ బుచ్చిబాబు సానా పెద్ది చిత్రాన్ని దర్శకత్వం వహించారు.
Q4. పెద్ది సినిమా నిర్మాతలు ఎవరు?
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు.
Q5. పెద్ది ట్రైలర్ లో వైరల్ డైలాగ్ ఏమిటి?
“ఆటే నా పొగరు” మరియు “మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు.. కానీ నేను పోరాడాను సార్” అనే డైలాగ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Q6. పెద్ది సినిమా జానర్ ఏమిటి?
పెద్ది ఒక రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం.


