హైదరాబాద్, తేది: 13-02-2026
ప్రఖ్యాత సినీ నటుడు రామ్‌చరణ్ తన కవల పిల్లల పేర్లను అధికారికంగా వెల్లడించారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
అబ్బాయి పేరు శివరామ్, అమ్మాయి పేరు అన్విరా దేవి అని తెలిపారు. జనవరి 31న ఉపాసన కామినేని–రామ్‌చరణ్ దంపతులకు కవలలు జన్మించిన విషయం తెలిసిందే.
ఈ సంతోషకరమైన వార్తతో చిరంజీవి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు.
ఈ సందర్భంగా అభిమానులు చిన్నారుల ఫోటోల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


