HomeWarangal News300 ఏళ్ల తర్వాత రామప్ప ఆలయంలో అద్భుతం.. మళ్లీ మొదలైన జలాభిషేకం!

300 ఏళ్ల తర్వాత రామప్ప ఆలయంలో అద్భుతం.. మళ్లీ మొదలైన జలాభిషేకం!

Published on

spot_img

ములుగు: వెంకటాపూర్‌ మండలంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. సుమారు 300 ఏళ్లుగా నిలిచిపోయిన పూర్తిస్థాయి నిత్య జలాభిషేకం శనివారం పునఃప్రారంభమైంది. రామప్ప ఆలయంలో కొలువైన రుద్రేశ్వరుడికి ఇకపై సంప్రదాయ పద్ధతిలో జలాభిషేకం జరిగే అవకాశం ఏర్పడింది.

భూకంపంతో మూసుకుపోయిన సోమసూత్రం :

17వ శతాబ్దంలో సంభవించిన భూకంపం కారణంగా ఆలయ గర్భగుడి నుంచి అభిషేక జలం బయటకు వెళ్లే సోమసూత్రం మూసుకుపోయింది. దీంతో స్వామివారికి పూర్తిస్థాయిలో జలాభిషేకం నిర్వహించడం సాధ్యం కాలేదు. అప్పటి నుంచి ఈ మార్గాన్ని పునరుద్ధరించేందుకు అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ తాజాగా శాస్త్రీయ పరిరక్షణ పద్ధతులతో పనులు చేపట్టారు.

300 ఏళ్ల తర్వాత రామప్పలో జలాభిషేకం.. అద్భుత ఘట్టం!
300 ఏళ్ల తర్వాత రామప్పలో జలాభిషేకం.. అద్భుత ఘట్టం!

ఆధునిక సాంకేతికతతో పునరుద్ధరణ :

ఆలయ నిర్మాణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అత్యంత జాగ్రత్తగా పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇందుకోసం 3డీ మ్యాపింగ్‌, ఎండోస్కోపిక్‌ కెమెరాలు, జీవోప్రో కెమెరాలను వినియోగించారు. రియల్‌టైమ్‌ మానిటరింగ్‌ స్క్రీన్ల ద్వారా లోపలి పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ పనులు కొనసాగించారు.

సోమసూత్రంలో పేరుకుపోయిన అడ్డంకులను సాఫ్ట్‌ డ్రిల్లింగ్‌ విధానంలో పొరల వారీగా తొలగించారు. దీంతో శతాబ్దాలుగా మూసుకుపోయిన మార్గం తిరిగి అందుబాటులోకి వచ్చింది.

ఏఎస్ఐ పర్యవేక్షణలో పనులు :

దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో ఏఎస్ఐ హైదరాబాద్‌ సర్కిల్‌ బృందం ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పునరుద్ధరణ ప్రక్రియ సాగింది. ఇన్‌టాక్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారావు, కేంద్ర పురావస్తు శాఖ డీఈ కృష్ణచైతన్య, ఉమ్మడి వరంగల్‌ జిల్లా సీఏలు మల్లేష్‌, కృష్ణవంశీ, రామప్ప ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్‌ తదితరుల సమక్షంలో పనులు నిర్వహించారు.

సోమసూత్రం పునరుద్ధరణతో రామప్ప ఆలయ చారిత్రక, ఆధ్యాత్మిక వైభవంలో మరో కీలక ఘట్టం నమోదైంది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles