HomePoliticsతెలంగాణ రాజకీయాల్లో రేర్ సీన్..MLA నాయిని ఇంట్లో మంత్రి కొండా సురేఖ స్పెషల్ డిన్నర్..!

తెలంగాణ రాజకీయాల్లో రేర్ సీన్..MLA నాయిని ఇంట్లో మంత్రి కొండా సురేఖ స్పెషల్ డిన్నర్..!

Published on

spot_img

పాలిటిక్స్ అంటే ఎప్పుడు అరుపులేనా..? గొడవలేనా..? తగాదాలేనా..? విమర్శలేనా..? కాదు..

అప్పుడప్పుడు సరదాగా స్నేహపూర్వకంగా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మీట్ అవుతుంటారు. అలాంటి ఒక సీన్ ఇప్పుడు రిపీట్ అయింది. అదే తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు సెన్సేషన్ గా మారింది.

ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఉప్పు నిప్పుగా ఉండే సీనియర్ నేతలు సోమవారం సాయంత్రం ఆత్మీయంగా ఒక్కచోట చేరి మంచి-చెడు మాట్లాడుకున్నారు.

దీంతో ఈ న్యూస్ బిగ్ హాట్ టాపిక్ గా మారింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన క్యాంప్ ఆఫీసుల్లో స్పెషల్ గా కొంతమంది నేతలకు డిన్నర్ ఏర్పాటు చేశారు.

ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ హైలెట్ ఏంటంటే..ఈ డిన్నర్ కు దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ మొదటిసారి నాయిని ఇంటికి వచ్చారు.

కొండ సురేఖతోపాటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కె ఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డీసీసీ అధ్యక్షులు, కూడా చైర్మన్ ఇనగల వెంకట్రామిరెడ్డి , వరంగల్ అధ్యక్షుడు అయూబ్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి, మాజీ మేయర్ గుండు సుధారాణి తదితరులు ఈ డిన్నర్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నేతలు అందరూ ఒకరినిఒకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ కలిసి భోజనం చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

అంతేకాదు విందు అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ఇది చాలా స్నేహపూర్వకంగా జరిగిన మీటింగ్ అని ఇందులో వరంగల్ అభివృద్ధి గురించి చాలా అంశాలు మాట్లాడామని..వాటి గురించి చర్చించుకున్నామని ఆమె చెప్పుకు వచ్చారు.

దీంతో వరంగల్ పాలిటిక్స్ లో ఇప్పుడు కొండా సురేఖ పేరు అదేవిధంగా నాయిని రాజేందర్ రెడ్డి పేర్లు సెన్సేషన్ గా మరాయి.

Latest articles

AI 80’s ఫోటో ట్రెండ్‌పై నిపుణుల హెచ్చరిక.. ఫోటోలు అప్‌లోడ్ చేసే ముందు జాగ్రత్త!

AI టూల్స్‌తో 1980ల నాటి ఫోటోల తరహాలో చిత్రాలను మార్చుకునే ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వ్యక్తిగత ఫోటోలను AI ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసే ముందు ప్రైవసీ, డేటా భద్రతపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బిగ్ బాస్ హోస్టుల రెమ్యునరేషన్.. ఒక్కో సీజన్‌కు కోట్లలో పారితోషికం!

బిగ్ బాస్ షోకు హోస్టులుగా వ్యవహరించిన ప్రముఖ నటులు, సెలబ్రిటీలకు భారీగా పారితోషికం అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో సీజన్‌కు ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసుకోవాలంటే ఈ వివరాలు చూడాల్సిందే.

అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి ప్రశంసలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) సామాజిక బాధ్యతలో భాగంగా కీలక కార్యక్రమం చేపట్టింది. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది బాలికలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

నిద్రలో పదేపదే మేల్కొంటున్నారా? మీ శరీరం చెప్తుందే ఇదే..!

రాత్రిపూట నిద్రలో పదేపదే మెలకువ రావడానికి ఒత్తిడి, ఆందోళన, కెఫిన్, గది వాతావరణం వంటి కారణాలు ఉండొచ్చు. అయితే గురకతో పాటు శ్వాస ఆగడం, పగటిపూట అధిక నిద్రమత్తు ఉంటే స్లీప్ అప్నియా సంకేతాలు కావచ్చు.
spot_img

Related Articles

కాంగ్రెస్ భూ స్కామ్‌లు, 22A దుర్వినియోగంపై BRS ధ్వజం

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ భూ అక్రమాలు మరియు 22A నిబంధనల దుర్వినియోగంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

కాంగ్రెస్, BRSలపై ఫైర్ అయిన బీజేపీ నేత రామచందర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి, వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లోకి రానివ్వం: జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖను బీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.