వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరిన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఆసుపత్రి మార్చురీ గదిలోని మృతదేహాన్ని ఎలుకలు కొరికిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఈ ఉదంతంపై మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందిస్తూ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ డాక్టర్ వీరిన్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ భరత్ బాధ్యతలు స్వీకరించారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


