హైదరాబాద్‌లోని బేగంబజార్ నడిరోడ్డుపై ఒక సినిమా సీన్‌ను తలపించేలా సాహసం జరిగింది. ఒక మహిళ మెడలోని గొలుసును లాక్కొని బైక్‌పై పారిపోతున్న దొంగను చూసిన ఆటో డ్రైవర్ మొహమ్మద్ జహీర్, ఏమాత్రం వెనుకాడకుండా తన ఆటోతో అతడిని ఢీకొట్టి కింద పడేశారు.
కింద పడ్డ ఆ రౌడీ షీటర్ కర్రతో దాడి చేసినప్పటికీ, జహీర్ తన ప్రాణాలకు తెగించి అతడిని పట్టుకున్నారు. జహీర్ ధైర్యసాహసాలను గుర్తించిన హైదరాబాద్ సీపీ సజ్జనార్, ఆయనను ప్రత్యేకంగా సన్మానించి ‘రియల్ హీరో’గా కొనియాడారు.


