ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారితో ఢిల్లీలోని ఆయన నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


