వరంగల్ చరిత్రలో తొలిసారిగా రాకెట్ లాంచింగ్ జరగనుంది.
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న హనుమకొండ హయగ్రీవాచారి గ్రౌండ్లో ‘రుద్రమ’ పేరుతో రూపొందించిన మోడల్ రాకెట్ను ఆకాశంలోకి ప్రయోగించనున్నారు.
ఇస్రో స్పేస్ ట్యూటర్ ఏటీడీఆర్ఎల్ సంస్థ వ్యవస్థాపకుడు శశాంక్ భూపతి నేతృత్వంలో, వరంగల్ నిట్, కుడా సహకారంతో కార్యక్రమం నిర్వహించనున్నారు.
అదే రోజు మధ్యాహ్నం 2- 5 గంటల వరకు అంతరిక్ష విజ్ఞాన సదస్సు ఉంది.


