HomeWarangal Newsరౌడీ షీటర్ ను కమిషనరేట్ పరిధి నుండి బహిష్కరించిన సిపి

రౌడీ షీటర్ ను కమిషనరేట్ పరిధి నుండి బహిష్కరించిన సిపి

Published on

spot_img

వరంగల్ పోలీస్ కమిషనరేట్: శాంతి భద్రతల పరిరక్షణ పరిరక్షణలో మీల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్‌ వంచనగిరి సురేష్ @ కోతి సురేష్ ను వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుండి బహిష్కరణ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

తొలిసారిగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజా శాంతి, భద్రతలకు భంగం కలిగిస్తున్న రౌడీషీటర్ వంచనగిరి సురేష్ @ కోతి సురేష్ (వయస్సు 31 సంవత్సరాలు) పై హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం, 1348 ఫస్లి (వరంగల్ మెట్రోపాలిటన్ ఏరియా పోలీస్ చట్టం, 2015) లోని సెక్షన్ 26(1) ప్రకారం ఆరు నెలలు బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.

ఈ ఉత్తర్వుల జారీ అనంతరం మీల్స్ కాలని ఇన్స్ స్పెక్టర్ రమేష్, ఎస్. ఐ మిథున్ నిందితుడు కోతి సురేష్ ను వరంగల్ పోలీస్ కమిషనరేట్ సరిహద్దులో సీపీ జారీచేసిన ఉత్తర్వులను అందజేశారు.

మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు చెందిన వంచనగిరి సురేష్ రౌడీషీటర్‌గా గుర్తించబడిన వ్యక్తి కాగా, అతనిపై గతంలో పలు తీవ్రమైన నేర కేసులు నమోదై ఉన్నాయి.

ఆయా కేసులు ప్రజలలో భయాందోళనలను సృష్టిస్తూ, శాంతియుత జీవన విధానానికి ఆటంకం కలిగించినట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి.

ఇతని అక్రమ కార్యకలాపాల కారణంగా ప్రజలు ఫిర్యాదులు చేయడానికి కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో, అతనికి కారణాలు చూపించాలని నోటీసు జారీ చేయగా, సంబంధిత అధికారుల ఎదుట హాజరుకాలేదు.

ఎలాంటి వ్రాతపూర్వక వివరణ ఇవ్వకపోవడంతో, అతని వైఖరి ప్రజా శాంతికి ముప్పుగా మారిందని నిర్ధారణకు వచ్చారు.

అందువల్ల, ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని, వంచనగిరి సురేష్‌ను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి ఆరు (6) నెలల కాలానికి వెంటనే బయటకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి.

కోర్టు హాజరు కోసం మాత్రమే ముందస్తు అనుమతితో కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వబడుతుంది.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు భయభ్రాంతులకు లోనుకాకుండా నేరాలపై సమాచారం అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

—వరంగల్ పోలీస్ కమిషనరేట్

Latest articles

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

దవడ చూపిస్తూ విజయ్ చేసిన సైగ..సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!

తాను మాట్లాడే సమయంలో సహజంగా వ్యక్తమయ్యే హావభావాలను తప్పుగా అర్థం చేసుకోవద్దని విజయ్ కోరారు. తన చర్యలు, సంజ్ఞలు ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసినవి కావని పేర్కొన్నారు

“ధురంధర్’ సాంగ్‌తో మోదీకి గ్రాండ్ వెల్‌కమ్”.. గూస్ బంప్స్ వీడియో..!

గుజరాత్‌లోని వడోదర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి అదిరిపోయే స్వాగతం లభించింది. ఆయన స్టేజ్‌పైకి రాగానే ‘ధురంధర్’ సినిమాలోని ‘ఆరి ఆరి’, ‘We Will Rock You’ పాటలు వినిపించడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది.
spot_img

Related Articles

అసెంబ్లీ ముట్టడికి యత్నం: వరంగల్‌లో 11 మంది ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

జీతాల పెంపు, పెరిగిన పని ఒత్తిడిని తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన కార్యక్రమానికి బయలుదేరుతున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

హనుమకొండలో తీవ్ర కలకలం: మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం

హనుమకొండ నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో మంగళవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. స్థానిక మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసులకు ప్రజా బాంధవ్య శిక్షణ

పండుగలు, జాతరలు, ఊరేగింపుల వంటి సందర్భాల్లో భారీగా కూడే జనసమూహాల పట్ల పోలీసులు మెలగాల్సిన తీరుపై భద్రాద్రి జోనల్ పరిధిలోని శిక్షకులకు (ట్రైనర్లకు) ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.