HomeLatest NewsRRB JE పరీక్ష తేదీలు వచ్చేశాయి.. 4,029 పోస్టులకు బిగ్ అప్‌డేట్!

RRB JE పరీక్ష తేదీలు వచ్చేశాయి.. 4,029 పోస్టులకు బిగ్ అప్‌డేట్!

Published on

spot_img

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నుంచి జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ మెటలార్జికల్ అసిస్టెంట్ (CMA) ఉద్యోగాలకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ఈ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT-1) పరీక్ష తేదీలను బోర్డు ప్రకటించింది. అక్టోబర్ 27, 28, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా CBT-1 పరీక్ష నిర్వహించనున్నారు.

4,029 పోస్టుల భర్తీ :

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 4,029 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలో 111 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ సెప్టెంబర్ 13తో ముగిసింది. అయితే దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉన్న అభ్యర్థులకు సవరణ చేసుకునే అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 16 నుంచి 25 వరకు ఈ కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది.

పరీక్షకు ముందు సిటీ స్లిప్, అడ్మిట్ కార్డు :

CBT-1కు హాజరయ్యే అభ్యర్థుల కోసం పరీక్షా నగరం, పరీక్ష తేదీ వంటి వివరాలతో కూడిన సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను పరీక్షకు 10 రోజుల ముందు విడుదల చేయనున్నారు. ఇక అడ్మిట్ కార్డును పరీక్షకు 4 రోజుల ముందు అందుబాటులోకి తీసుకురానున్నారు.

నాలుగు దశల్లో ఎంపిక :

ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో స్టేజ్-1 CBT, స్టేజ్-2 CBT, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్ష ఉంటాయి. అన్ని దశల్లో అర్హత సాధించిన వారిని రైల్వే నిబంధనల ప్రకారం సంబంధిత పోస్టులకు ఎంపిక చేస్తారు. పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు తమ ప్రాంతీయ RRB అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలని బోర్డు సూచించింది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.