హనుమకొండ: గ్రామీణ తపాలా ఉద్యోగుల సమ్మె దేశవ్యాప్తంగా తీవ్రంగా కొనసాగుతోంది. ఈ సమ్మె భాగంగా హనుమకొండలో కూడా తపాలా ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ (AIGDSU) పిలుపుతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
హనుమకొండ డివిజనల్ పోస్టల్ కార్యాలయం ఎదుట ఈరోజు(జూన్ 23న )మధ్యాహ్నం 3 గంటలకు దేశవ్యాప్త ధర్నా నిర్వహిస్తున్నట్లు AIGDSU జాతీయ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రధాన డిమాండ్లు ఇవే:
• గ్రామీణ తపాలా ఉద్యోగులను (GDS) 8వ కేంద్ర వేతన సంఘం పరిధిలోకి తీసుకురావాలి.
• ఉద్యోగులందరికీ సమాన పెన్షన్ సౌకర్యం కల్పించాలి.
• తపాలా ఉద్యోగులకు తగిన వైద్య సదుపాయాలు అందించాలి.
• విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు రూ. 10 లక్షల ప్రమాద భీమా కల్పించాలి.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ ధర్నాను చేపడుతున్నట్లు యూనియన్ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ గ్రామీణ తపాలా ఉద్యోగుల సమ్మె చేపట్టినట్లు యూనియన్ నాయకులు స్పష్టం చేశారు.
FAQ’s
1. గ్రామీణ తపాలా ఉద్యోగుల సమ్మె ఎందుకు చేస్తున్నారు?
వేతనాలు, పెన్షన్, భీమా వంటి కీలక డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నారు.
2. హనుమకొండలో ధర్నా ఎక్కడ జరిగింది?
డివిజనల్ పోస్టల్ కార్యాలయం ఎదుట జరిగింది.
3. ఈ సమ్మెను ఎవరు నిర్వహిస్తున్నారు?
ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ (AIGDSU).
4. ప్రధాన డిమాండ్లు ఏమిటి?
8వ వేతన సంఘం అమలు, సమాన పెన్షన్, వైద్య సదుపాయాలు, ప్రమాద భీమా.
Read Warangal News and Latest Politics News and Real Estate

