హన్మకొండ జిల్లాకు చెందిన ప్రముఖ వేద పండితులు, సాహితీవేత్త సముద్రాల శఠగోపాలాచార్యులు రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన అధికారిక వేడుకల్లో ఆయనను ఈ పురస్కారంతో ఘనంగా సన్మానించారు.
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా శరగోపాలాచార్యులకు ఈ అవార్డు లభించింది. పురస్కారంతో పాటు ఆయనకు రూ. 10,116 నగదు, జ్ఞాపికను అందజేసి ప్రభుత్వ గౌరవాన్ని చాటారు. గత పదేళ్లుగా వరంగల్ నగరంలో ఆయన నిర్వహిస్తున్న నిరంతర ఆధ్యాత్మిక సేవలు, వేద పరిజ్ఞానానికి గుర్తింపుగా ప్రభుత్వం ఈ ఎంపిక చేసింది. హనుమకొండ మట్టి నుంచి ఒక పండితుడికి రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


