HomeWarangal Newsమేడారం జాతరకు హెలికాప్టర్ సందడి: ప్రారంభించిన మంత్రి సీతక్క

మేడారం జాతరకు హెలికాప్టర్ సందడి: ప్రారంభించిన మంత్రి సీతక్క

Published on

spot_img

హన్మకొండ/ములుగు: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర భక్తులకు ఈసారి సరికొత్త అనుభూతిని పంచనుంది. జాతరను పురస్కరించుకుని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ సర్వీసులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఘనంగా ప్రారంభించారు.

కాలినడక నుంచి హెలికాప్టర్ దాకా

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జాతర ప్రయాణంలో వచ్చిన మార్పులను గుర్తు చేసుకున్నారు. “మా చిన్నతనంలో ఊరి నుంచి మేడారానికి మూడు రోజుల ముందుగానే కాలినడకన బయలుదేరేవాళ్ళం. ఆ తర్వాత ఎడ్ల బండ్లు, కార్లు వచ్చాయి.

ఇప్పుడు ఏకంగా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రావడం జాతర ఎంతగా అభివృద్ధి చెందిందో చెబుతోంది” అని ఆమె వ్యాఖ్యానించారు. భక్తులు, పర్యాటకులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

 హన్మకొండలోని ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నుంచి ఈ సర్వీసులు ప్రారంభమయ్యాయి. పర్యాటక శాఖ సమన్వయంతో తుంబి ఏవియేషన్ సంస్థ ఈ హెలికాప్టర్ రైడ్లను నిర్వహిస్తోంది.

హన్మకొండ నుంచి మేడారానికి వెళ్లేందుకు షటిల్ సర్వీసులతో పాటు, మేడారం పరిసరాలను గగనతలం నుండి వీక్షించేలా ‘జాయ్ రైడింగ్’ సౌకర్యాన్ని కూడా కల్పించారు. అదనపు కలెక్టర్ సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ తొలి జాయ్ రైడింగ్‌లో పాల్గొని ములుగు గగనతలంలో విహరించారు.

జాతర వైభవాన్ని ఆకాశం నుండి చూసే అవకాశం రావడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Latest articles

అమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

అమెరికాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు కీలక సూచనలు వెలువడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో భారీగా వేడుకలు నిర్వహించకుండా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కమ్యూనిటీ పెద్దలు కోరుతున్నారు

అర్హత లేని టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అర్హతలు లేని టీచర్ల నియామకాలు, కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.
spot_img

Related Articles

అసెంబ్లీ ముట్టడికి యత్నం: వరంగల్‌లో 11 మంది ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

జీతాల పెంపు, పెరిగిన పని ఒత్తిడిని తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన కార్యక్రమానికి బయలుదేరుతున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

హనుమకొండలో తీవ్ర కలకలం: మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం

హనుమకొండ నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో మంగళవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. స్థానిక మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసులకు ప్రజా బాంధవ్య శిక్షణ

పండుగలు, జాతరలు, ఊరేగింపుల వంటి సందర్భాల్లో భారీగా కూడే జనసమూహాల పట్ల పోలీసులు మెలగాల్సిన తీరుపై భద్రాద్రి జోనల్ పరిధిలోని శిక్షకులకు (ట్రైనర్లకు) ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.