సీతారాంపురంలో ఘనంగా గ్రామదేవతల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం..:
పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామంలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన గ్రామదేవతల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఆద్యంతం భక్తిశ్రద్ధల మధ్య ముగిసింది. శ్రీలక్ష్మి, భూలక్ష్మి సమేత బొడ్రాయి, పోచమ్మ, దుర్గమ్మ, మైసమ్మ దేవతలతో పాటు నాగేంద్ర స్వామి, నవగ్రహాల నూతన విగ్రహాల ప్రాణ ప్రతిష్టా కార్యక్రమాలు ప్రత్యేక పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక వేడుకల నడుమ నిర్వహించారు.
మహోత్సవం చివరి రోజు నిర్వహించిన ముగింపు కార్యక్రమాలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల నియోజకవర్గ నాయకులు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయంలో ప్రతిష్టించిన నూతన విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామదేవతల ఆశీస్సులతో సీతారాంపురం గ్రామం సుఖశాంతులు, ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలందరిపై అమ్మవార్ల కరుణ ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతిష్టాపన కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులను ఆయన అభినందించారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీతారాంపురం గ్రామ బూత్ అధ్యక్షుడు ఉడుత చిరంజీవి, జిల్లా ట్రెజరర్ ఎర్రం రామన్న, పరకాల పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి, చందుపట్ల రాజిరెడ్డి, వార్డు కౌన్సిలర్లు కుక్కల విజయ్, బెజ్జంకి పూర్ణచారి, మున్సిపల్ చైర్మన్ మార్త రాజభద్రయ్య, మాజీ కౌన్సిలర్ కొలనుపాక భద్రయ్య, దామర మండల అధ్యక్షుడు వేల్పుల రాజ్‌కుమార్, మాజీ మండల అధ్యక్షుడు జంగిలి నాగరాజుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


