హన్మకొండ: మహిళల రక్షణే లక్ష్యంగా హనుమకొండ రెవెన్యూ కాలనీలోని ఎస్టీ (ST) బాలికల హాస్టల్లో షీ టీమ్స్ (SHE Teams) ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 180 మంది విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
షీ టీమ్స్ పనితీరు, బాలల దుర్వినియోగ నిరోధం (POCSO), మరియు ఆపద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పోలీసు అధికారులు వివరించారు. మహిళల భద్రత కోసం అందుబాటులో ఉన్న ‘T-Safe’ యాప్ మరియు చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ ‘1098’ గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, విద్యార్థినులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


