హన్మకొండ నగరంలో ట్రాఫిక్ చిక్కులను వదిలించేందుకు పోలీసులు సరికొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చారు. ప్రధాన కూడళ్లలో వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.
ట్రాఫిక్ పోలీసులు షిఫ్ట్ సమయం కంటే ఒక గంట ముందే పాయింట్లకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఉదయం వేళల్లో స్కూల్, కాలేజీ బస్సులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అవసరమైతే ఇతర వాహనాలను ప్రత్యామ్నాయ దారుల్లో మళ్లిస్తారు.
ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, వీలైతే ఉదయం 9 గంటల తర్వాతే బయటకు రావాలని సీపీ వాహనదారులకు సూచించారు.


