దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల ఆగమనానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ వారాంతంలోగా నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా రుతుపవనాల పురోగతి వేగంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మరో 10 రోజుల్లో కేరళ తీరాన్ని రుతుపవనాలు చేరుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
ఇక మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరికొన్ని గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.


