వరంగల్ ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా ప్రత్యేక దృష్టి సారించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఓటర్ మ్యాపింగ్ శాతం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల ప్రత్యేక పరిశీలన కార్యక్రమం ఎస్ఐఆర్ లో భాగంగా ఆదివారం వరంగల్, ఖిలా వరంగల్ తహసీల్దార్ల ఆధ్వర్యంలో పలు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ శివనగర్, చింతల్ ప్రాంతాలను సందర్శించి ఓటర్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, తహసిల్దార్లతో సమావేశమై ఓటర్ మ్యాపింగ్ శాతం పెంపు పై సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు తప్పులు లేకుండా నమోదు కావాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఇంటింటి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు ఎన్నికల ప్రాముఖ్యతను వివరించి ప్రతి అర్హుడిని ఓటర్ జాబితాలో చేర్చేలా కృషి చేయాలని ఆదేశించారు . ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, జెడ్పి సీఈఓ రామ్ రెడ్డి, వరంగల్ తహసిల్దార్ శ్రీకాంత్, ఖిలా వరంగల్ తహసిల్దార్ ఇక్బాల్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


