HomeWarangal Newsతెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ పోలీసులకు రాష్ట్ర పురస్కారాలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ పోలీసులకు రాష్ట్ర పురస్కారాలు

Published on

spot_img

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ పోలీసులకు రాష్ట్ర పురస్కారాలు:

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విధినిర్వహణలో విశిష్ట సేవలను అందించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ కి చెందిన పలువురు పోలీస్ అధికారులు, సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలకు ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ముగ్గురు పోలీసు అధికారులకు ఉత్తమ సేవా పతకాలు, 19 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బందికి సేవా పతకాలు ప్రకటించడం విశేషం.

ఉత్తమ సేవా పతకాలకు ఎంపికైన వారిలో సీఏఆర్‌కు చెందిన ఏఆర్‌ఎస్‌ఐ ఎం.డి. షర్ఫుద్దీన్, సీఎస్‌బీ విభాగానికి చెందిన ఏఎస్‌ఐ పి. వెంకట్ రెడ్డి, ఏఆర్‌ఎస్‌ఐ పి. మల్లారెడ్డి ఉన్నారు. వీరు తమ విధుల్లో చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజా సేవల పట్ల అంకితభావానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందుకోనున్నారు.

అదేవిధంగా సేవా పతకాలకు ఎంపికైన వారిలో పర్వతగిరి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి.రాజగోపాల్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె. సుజాత, క్రైమ్స్ ఇన్స్పెక్టర్ ఎ. రాఘవేందర్, పరకాల ఇన్స్పెక్టర్ వి. క్రాంతి కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ పి. స్పార్జన్ రాజ్, ఎస్‌ఐ పి. శ్రీనివాస్ రాజుతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు.

సైబర్ క్రైమ్స్, సీసీఎస్, సీఏఆర్, సీఎస్‌బీ, సీసీఆర్‌బీ, సీటీసీ, సీపీటీసీ వంటి విభాగాలకు చెందిన సిబ్బంది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, దర్యాప్తు మరియు ప్రత్యేక విధుల్లో చూపిన ప్రతిభను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రస్థాయిలో వరంగల్ కమిషనరేట్ కు చెందిన పెద్ద సంఖ్యలో అధికారులు సిబ్బంది పురస్కారాలకు ఎంపిక కావడం పట్ల పోలీసుశాఖలో ఆనందం వ్యక్తం అవుతుంది. ఈ గుర్తింపు భవిష్యత్తులో మరింత బాధ్యతయుతంగా సేవలు అందించేందుకు ప్రోత్సాహకంగా నిలుస్తుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.

Latest articles

AI 80’s ఫోటో ట్రెండ్‌పై నిపుణుల హెచ్చరిక.. ఫోటోలు అప్‌లోడ్ చేసే ముందు జాగ్రత్త!

AI టూల్స్‌తో 1980ల నాటి ఫోటోల తరహాలో చిత్రాలను మార్చుకునే ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వ్యక్తిగత ఫోటోలను AI ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసే ముందు ప్రైవసీ, డేటా భద్రతపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బిగ్ బాస్ హోస్టుల రెమ్యునరేషన్.. ఒక్కో సీజన్‌కు కోట్లలో పారితోషికం!

బిగ్ బాస్ షోకు హోస్టులుగా వ్యవహరించిన ప్రముఖ నటులు, సెలబ్రిటీలకు భారీగా పారితోషికం అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో సీజన్‌కు ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసుకోవాలంటే ఈ వివరాలు చూడాల్సిందే.

అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి ప్రశంసలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) సామాజిక బాధ్యతలో భాగంగా కీలక కార్యక్రమం చేపట్టింది. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది బాలికలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

నిద్రలో పదేపదే మేల్కొంటున్నారా? మీ శరీరం చెప్తుందే ఇదే..!

రాత్రిపూట నిద్రలో పదేపదే మెలకువ రావడానికి ఒత్తిడి, ఆందోళన, కెఫిన్, గది వాతావరణం వంటి కారణాలు ఉండొచ్చు. అయితే గురకతో పాటు శ్వాస ఆగడం, పగటిపూట అధిక నిద్రమత్తు ఉంటే స్లీప్ అప్నియా సంకేతాలు కావచ్చు.
spot_img

Related Articles

వరంగల్‌లో మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం

మాజీ మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చొరవతో ప్రమాదకర గుంతల పూడ్చివేత..

నగర పరిధిలోని ఫాతిమా బ్రిడ్జి, అదాలత్ సెంటర్ ప్రధాన రహదారులపై వాహనదారులకు నరకం చూపుతున్న ప్రమాదకర గుంతలను ట్రాఫిక్ సీఐ వెంకన్న తన సొంత చొరవతో పూడ్చివేయించారు.

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో సడన్‌గా చెలరేగిన మంటలు: సకాలంలో స్పందించి పెను ప్రమాదాన్ని తప్పించిన డెలివరీ బాయ్స్

విద్యుత్‌నగర్‌లోని రోడ్‌ నంబర్‌ 1 సమీపంలో ఒక భారీ ప్రమాదం తృప్తిలో తప్పింది. గురువారం రోజున అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.