స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం: తేదీ:19.01.2026
మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి…..
ప్రతీ పని, ప్రతీ పథకానికి మహిళల పేరు మీదనే అమలు….
కోటి మంది మహిళలకు ఒకే రకమైన చీరలు…..
18ఏళ్ళు నిండిన ప్రతీ మహిళకు చీరలు పంపిణి చేయాలి…..
మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత
మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం అభివృద్ధి చెందుతుంది

మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ….మహిళల ఆత్మగౌరవాన్ని నిలిపేలా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ నిర్వహిస్తోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అన్నారు.
స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ లో నిర్వహించిన స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరా క్రాంతి పథకం కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణి కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, జిల్లా అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడుతూ…..
మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

అందులో భాగంగానే మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ పంపులు మరియు వ్యవసాయ రంగాలలో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషించే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని పేర్కొన్నారు.
మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి నాణ్యమైన చీరలను అందిస్తుందన్నారు. మహిళల సామాజిక–ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని మాడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు మన ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు కృషి చేస్తున్నారని అన్నారు.

నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి ఎం కావాలో, ఎం చేయాలో కూడా తెలుసని అన్నారు.
గతంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం పేరు చెప్పుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవాని కానీ ఇప్పుడు తల ఎత్తుకొని మాది స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం అని చెప్పుకునే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నాడని తెలిపారు.

మహిళలు ఆత్మగౌరవంతో ఉండాలని ఇక్కడే మహిళా కమ్యూనిటీ హల్ మంజూరు చేయడం అందులో నన్ను బాగాస్వామిని చేయడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి 1400కోట్ల నిధులు తీసుకువచ్చి తన మార్క్ అభివృద్ధి పనులు చేపడుతున్నారని కొనియాడారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ…
మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద పీట వేస్తున్నారని అన్నారు.
ఒకవైపు వ్యవసాయానికి అండగా ఉంటూనే అనేక రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ మహిళా సంక్షేమానికి కొత్త కార్యక్రమాలు కొత్త పథకాలు తీసుకువచ్చి అమలు చేస్తూ మహిళలను ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారాని తెలిపారు.

ఈ సందర్భంగా ఈ రెండు సంవత్సరాల కాలంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణి, ఇందిరమ్మ ఇల్లు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఒక్క ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చాగల్, శివునిపల్లి, ఘనపూర్ గ్రామాలకు ఇప్పటికే 300 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసానని మళ్ళీ వచ్చే రెండవ విడతలో వచ్చే 3500ఇళ్లలో ఒక్క ఘనపూర్ మున్సిపాలిటీకే 500ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
మహిళలు కలిస్తే సాధించెలేనిది ఏది లేదని అన్నారు. మీకు ఎప్పుడూ ఎలాంటి సహాయం కావాలన్న నా పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.
మహిళా సంఘాల సభ్యులందరు కలిసి ఒక శక్తి ఎదగాలదని ఆకాంక్షంచారు. ఘనపూర్ మున్సిపాలిటీని రుణాలు ఇవ్వడంలో, రికవరీ చేయడంలో మొదటి స్థానంలో నిలపాలని అన్నారు.
మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఘనపూర్ మున్సిపాలిటీ కేంద్రంలో మహిళా కమ్యూనిటీ హల్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
ఘనపూర్ ను మున్సిపాలిటీ గా చేసుకున్నాం, మున్సిపాలిటీ అభివృద్ధికి 50కోట్ల నిధులు కూడా తెచ్చుకున్నామని తెలిపారు. ఒక ఏడాదిలో 50కోట్ల పనులు పూర్తి చేసి స్టేషన్ ఘనపూర్ రూపు రేఖలు మార్చుతానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, ఆర్డివో వెంకన్న, డీఆర్ డివో వాసంతి, మెప్మా పీడీ హర్షవర్ధన్, టీఎంసి వాణి శ్రీ, తహసీల్దార్, మహిళా సంఘాల అధ్యక్షులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


