వరంగల్: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు హల్‌చల్ చేశారు. నిలిపి ఉంచిన ఒక బైక్‌ను మాయం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు మరియు బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… మిల్స్ కాలనీ పీఎస్ పరిధిలో స్ప్లెండర్ బైక్ (AP 20 AN 4366) చోరీకి గురైంది. ఘటనపై బాధితుడు వెంటనే మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
సీసీ కెమెరాలో రికార్డైన చోరీ దృశ్యాలు
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఒక మహిళ, పురుషుడు కలసి దొంగిలించిన బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. అనంతరం ఆ అనుమానితులు అదాలత్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో సదరు బైక్‌తో సంచరిస్తున్నట్లు గుర్తించారు.
ఈ బైక్ ఎవరికైనా కనిపిస్తే వెంటనే 76608 02349 నంబర్‌కు సమాచారం అందించాలని, లేదా స్థానిక మిల్స్ కాలనీ పోలీసులకు తెలియజేయాలని బాధితుడు మరియు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


