HomeWarangal Newsవిద్యాసంస్థల సమీపంలో పొగాకు విక్రయాలపై కఠిన చర్యలు: వరంగల్ పోలీసుల హెచ్చరిక

విద్యాసంస్థల సమీపంలో పొగాకు విక్రయాలపై కఠిన చర్యలు: వరంగల్ పోలీసుల హెచ్చరిక

Published on

spot_img

విద్యాసంస్థల సమీపంలో పొగాకు విక్రయాలపై కఠిన చర్యలు: వరంగల్ పోలీసుల హెచ్చరిక

వరంగల్ కమిషనరేట్ పరిధిలో విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు రక్షణే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పాఠశాలలో, కళాశాలల్లో మరియు ఇతర విద్యాసంస్థల పరిసరాలలో గుట్కా సిగరెట్టు తదితర పొగాకు ఉత్పత్తుల విక్రయాలను పూర్తిగా నిరోధించేందుకు “ఆపరేషన్ సేఫ్ స్కూల్” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ “సన్ ప్రీత్ సింగ్” మాట్లాడుతూ..”విద్యార్థులను చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యాసంస్థల చుట్టుపక్కల ప్రాంతాలను టొబాకో ఫ్రీ జోన్లుగా మార్చేందుకు ప్రత్యేకతనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు”.

పాఠశాలలు, కళాశాలల సమీపంలోని పాన్ షాపులు, కిరాణా దుకాణాలు మరియు ఇతర వ్యాపార కేంద్రాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. మైనర్లకు లేదా విద్యార్థులకు పొగాకు ఉత్పత్తుల విక్రయించినట్లు గుర్తిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విద్యాసంస్థల పరిసరాలలో పొగాకు ఉత్పత్తుల విక్రయం నిషేధమని తెలియజేసే అవగాహన గోడ పత్రికను కూడా కమిషనర్ ఆవిష్కరించారు. “సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్-2003” నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయిస్తే జువెనైల్ జస్టిస్ యాక్ట్-2015 ప్రకారం కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరైనా విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని కమిషనర్ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొని అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.

Latest articles

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.
spot_img

Related Articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...