హనుమకొండ: సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 10 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి రూ.27,810 నగదు, 9 మొబైల్ ఫోన్లు, ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తదుపరి చట్టపరమైన చర్యల కోసం నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను సుబేదారి పోలీసులకు అప్పగించారు.
టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించగా, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
Read Warangal News and Latest Politics News and Real Estate

