ధాన్యం కొనుగోలు ప్రక్రియ ను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం సంగెం, వర్ధన్నపేట మండలాల్లోని పీపీసీ కేంద్రాలు మరియు రైస్ మిల్లులను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్ రైతులకు అందుతున్న సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని ఆదేశాలు
ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిల్వలు తరలింపు ఏర్పాట్లు మరియు మిల్లింగ్ పనులపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. మొదట సంగెం మండలంలోని కాట్రపల్లి పీపీసీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్.. అక్కడ రైతులకు అందిస్తున్న సౌకర్యాలు, ధాన్యం కొనుగోలు విధానాన్ని పరిశీలించారు. అనంతరం కాపుల కనపర్తి గ్రామంలోని శ్రీవాణి రైస్ మిల్లును సందర్శించి మిల్లింగ్ కార్యకలాపాలను పరిశీలించారు..

తదుపరి వర్ధన్నపేట మండలంలోని కదిరిగూడెం భవాని ఎఫ్‌పీఓ, రామదాన్ తండా ఎరువాక ఎఫ్‌పీఓ, చంద్రు తండా పీపీసీ కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పీపీసీ కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా వేగవంతంగా నిర్వహించడంతో పాటు రైస్ మిల్లులో మిల్లింగ్ పనులు సజావుగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సూచించారు. అలాగే వాతావరణ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలి అని, అధిక ఉష్ణోగ్రతల ప్రభావం నుంచి రైతులను రక్షించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, సీఈఓ జెడ్పీ రాంరెడ్డి, పీడీ డీఆర్‌డీఏ నాగపద్మజా, డీసీఓ నీరజ, డీఎస్ఓ కిష్టయ్య, డీఎంసీఎస్ సంధ్యారాణి తదితర అధికారులు పాల్గొన్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


