హనుమకొండ పరిధిలోని 4వ డివిజన్, బాసిత్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ పద్మ పాల్గొని, ఇతర నాయకులతో కలిసి పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ, ప్రజలు స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటువ్యాధులు మరియు ఇతర రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


