తెలంగాణలో 7,437 పోలీసు ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం:
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TGPRB) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కాగా.. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 19 నుంచి ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
విభాగాల వారీగా ఖాళీలు:
పోలీసు శాఖలో SI, ASI, కానిస్టేబుల్ తదితర పోస్టులు ఉన్నాయి. సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 3,697, AR కానిస్టేబుల్ పోస్టులు 1,052, సివిల్ SI పోస్టులు 148గా ఉన్నాయి. వీటితో పాటు ఇతర విభాగాల్లోనూ ఖాళీలు ఉన్నాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 44 SI, 1,380 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ విభాగంలో 39 స్టేషన్ ఫైర్ ఆఫీసర్, 751 ఫైర్ ఫైటర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
జైళ్ల శాఖలోనూ ఉద్యోగాలు:
జైళ్ల శాఖలో 15 డిప్యూటీ జైలర్ పోస్టులు, 208 వార్డర్ పోస్టులు ఉన్నాయి. పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఖాళీలు కేటాయించారు.
అర్హతలు పరిశీలించుకోవాలి:
దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు సంబంధిత నోటిఫికేషన్‌లో విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, శారీరక ప్రమాణాలను తప్పనిసరిగా పరిశీలించాలి. పోస్టును బట్టి రాత పరీక్ష, PMT, PET తదితర దశల్లో ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తి వివరాల కోసం https://www.tgprb.in/ అధికారిక నోటిఫికేషన్లను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


