తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్‌ను ప్రకటించింది. మొత్తం ₹3,24,234 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, అభివృద్ధి మరియు సంక్షేమానికి పెద్దపీట వేశారు.
ఈ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం ₹2,34,406 కోట్లు, మూలధన వ్యయం ₹47,267 కోట్లుగా నిర్ణయించారు.
👉 వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ₹23,179 కోట్లు కేటాయించగా,
👉 విద్యా శాఖకు ₹26,674 కోట్లు,
👉 వైద్య ఆరోగ్యానికి ₹13,679 కోట్లు కేటాయించారు.
ఇరిగేషన్‌కు ₹22,615 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు ₹33,688 కోట్లు, పురపాలక అభివృద్ధికి ₹17,907 కోట్లు కేటాయించడం ద్వారా మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టారు.
⚡ విద్యుత్ శాఖకు ₹21,285 కోట్లు,
🏭 పరిశ్రమల అభివృద్ధికి ₹3,490 కోట్లు,
💻 ఐటీ శాఖకు ₹875 కోట్లు కేటాయించారు.
🌾 రైతులు & సంక్షేమ పథకాలు
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది:
🌱 రైతు భరోసా – ₹18,000 కోట్లు
🌾 సన్న వడ్ల బోనస్ – ₹3,500 కోట్లు
🌧️ పంట బీమా – ₹1,886 కోట్లు
🏠 సంక్షేమ పథకాలు & గ్యారంటీలు
ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలకు మొత్తం ₹50,713 కోట్లు కేటాయించారు:
🏡 ఇందిరమ్మ ఇండ్లు – ₹5,500 కోట్లు
👩 మహిళలకు మహాలక్ష్మి పథకం – ₹4,305 కోట్లు
🔌 గృహ జ్యోతి (ఉచిత విద్యుత్) – ₹2,080 కోట్లు
🛢️ LPG సబ్సిడీ – ₹723 కోట్లు
💊 రాజీవ్ ఆరోగ్యశ్రీ – ₹1,143 కోట్లు
అదనంగా:
🧾 కల్యాణలక్ష్మి / షాదీ ముబారక్ – ₹3,683 కోట్లు
🎓 స్కాలర్‌షిప్‌లు – ₹4,343 కోట్లు
🥗 విద్యార్థుల డైట్ ఛార్జీలు – ₹2,170 కోట్లు
🚧 అభివృద్ధి ప్రాజెక్టులు
🛣️ రీజనల్ రింగ్ రోడ్ – ₹1,525 కోట్లు
🌊 మూసి రివర్ ఫ్రంట్ – ₹1,500 కోట్లు
🏫 యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ – ₹5,000 కోట్లు
🏥 ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ – ₹1,056 కోట్లు
🏛️ ఉస్మానియా యూనివర్సిటీ – ₹1,000 కోట్లు
మొత్తం గా, ఈ బడ్జెట్‌లో సంక్షేమం మరియు అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదల సంక్షేమం దిశగా భారీ కేటాయింపులు చేయడం విశేషం.


