HomeLatest News"ఇక పై ట్రాన్స్‌జెండర్లు అలా చేస్తే ఊరుకోం"..డీజీపీ సంచలన ఆదేశాలు..!

“ఇక పై ట్రాన్స్‌జెండర్లు అలా చేస్తే ఊరుకోం”..డీజీపీ సంచలన ఆదేశాలు..!

Published on

spot_img

హైదరాబాద్‌లో శుభకార్యాల సందర్భంగా కొందరు ట్రాన్స్‌జెండర్లు బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి బెదిరింపులు, బలవంతపు వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అన్ని కమిషనరేట్ల పోలీసు కమిషనర్లకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

చింతల్ ఘటనపై కలకలం :

ఇటీవల హైదరాబాద్‌లోని చింతల్‌లో జరిగిన ఓ గృహప్రవేశ వేడుక ఈ వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 4న కొత్త ఇంట్లోకి ప్రవేశించేందుకు వచ్చిన కుటుంబాన్ని కొందరు ట్రాన్స్‌జెండర్లు అడ్డుకున్నట్లు సమాచారం. ఇంట్లోకి వెళ్లాలంటే రూ.50 వేల ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితులు ఆరోపించారు.

అంత మొత్తం ఇవ్వడం సాధ్యం కాదని చెప్పినా వారు వినకుండా అసభ్యంగా ప్రవర్తించారని, శాపనార్థాలు పెట్టారని బాధితురాలు వీడియో ద్వారా వెల్లడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటనపై తీవ్ర చర్చ జరిగింది. ఇలాంటి వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు పోలీసులను కోరారు.

గతంలోనూ ప్రత్యేక డ్రైవ్ :

ఈ తరహా ఫిర్యాదులు ఇటీవల తన దృష్టికి వస్తున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. తాను హైదరాబాద్ సీపీగా పనిచేసిన సమయంలోనూ బలవంతపు వసూళ్లు, బెగ్గింగ్ రాకెట్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నియంత్రించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం కూడా అదే తరహాలో చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

ఉపాధి అవకాశాలకు ప్రోత్సాహం :

ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, ఉపాధి కోసం తెలంగాణ ప్రభుత్వం పలు అవకాశాలు కల్పిస్తోందని డీజీపీ పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారంతో పలువురు ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా, ఇతర విభాగాల్లో ఉద్యోగాలు పొందుతూ ఎలాంటి ఫిర్యాదులు లేకుండా సేవలందిస్తున్నారని తెలిపారు. కొందరి చర్యల కారణంగా మొత్తం వర్గానికి చెడ్డపేరు రాకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.