HomeWarangal Newsప్రజా సంక్షేమమే లక్ష్యం: హన్మకొండలో రెండవ ఆర్థిక సంఘం ప్రాంతీయ సదస్సు

ప్రజా సంక్షేమమే లక్ష్యం: హన్మకొండలో రెండవ ఆర్థిక సంఘం ప్రాంతీయ సదస్సు

Published on

spot_img

తెలంగాణ రాష్ట్ర రెండవ ఆర్థిక సంఘం ఆధ్వర్యంలో సెంట్రల్ తెలంగాణ ప్రాంతీయ వర్క్‌షాప్ శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ (IDOC) కార్యాలయంలో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య నేతృత్వంలో ఈ సమీక్షా సమావేశం జరిగింది.

విద్య, ఆరోగ్యం, తాగునీటి సరఫరా, వ్యవసాయం, గ్రామీణ మరియు పట్టణ అభివృద్ధి వంటి అంశాలపై కమిషన్ సభ్యులు లోతుగా చర్చించారు. జిల్లాల వారీగా ఉన్న ఆర్థిక అవసరాలు, నిధుల వినియోగంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ వర్క్‌షాప్‌లో సెంట్రల్ తెలంగాణ పరిధిలోకి వచ్చే వరంగల్, హనుమకొండ, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు మరియు జనగామ జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

​ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం: కేవలం అధికారులే కాకుండా, క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు మాజీ జెడ్పీ చైర్‌పర్సన్లు, జెడ్‌పీటీసీలు, ఎంపీపీలు మరియు సర్పంచులు కూడా ఈ సమావేశంలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

​ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ కమిషన్ సభ్యులు సుధర్ రెడ్డి, మెంబర్ సెక్రెటరీ కాత్యాయిని, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయ్, ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు మరియు జెడ్పీ సీఈఓలు పాల్గొన్నారు.

Latest articles

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

దవడ చూపిస్తూ విజయ్ చేసిన సైగ..సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!

తాను మాట్లాడే సమయంలో సహజంగా వ్యక్తమయ్యే హావభావాలను తప్పుగా అర్థం చేసుకోవద్దని విజయ్ కోరారు. తన చర్యలు, సంజ్ఞలు ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసినవి కావని పేర్కొన్నారు

“ధురంధర్’ సాంగ్‌తో మోదీకి గ్రాండ్ వెల్‌కమ్”.. గూస్ బంప్స్ వీడియో..!

గుజరాత్‌లోని వడోదర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి అదిరిపోయే స్వాగతం లభించింది. ఆయన స్టేజ్‌పైకి రాగానే ‘ధురంధర్’ సినిమాలోని ‘ఆరి ఆరి’, ‘We Will Rock You’ పాటలు వినిపించడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది.
spot_img

Related Articles

అసెంబ్లీ ముట్టడికి యత్నం: వరంగల్‌లో 11 మంది ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

జీతాల పెంపు, పెరిగిన పని ఒత్తిడిని తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన కార్యక్రమానికి బయలుదేరుతున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

హనుమకొండలో తీవ్ర కలకలం: మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం

హనుమకొండ నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో మంగళవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. స్థానిక మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసులకు ప్రజా బాంధవ్య శిక్షణ

పండుగలు, జాతరలు, ఊరేగింపుల వంటి సందర్భాల్లో భారీగా కూడే జనసమూహాల పట్ల పోలీసులు మెలగాల్సిన తీరుపై భద్రాద్రి జోనల్ పరిధిలోని శిక్షకులకు (ట్రైనర్లకు) ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.