HomeLatest Newsతెలంగాణలో బక్రీద్ సెలవు మార్పు..ప్రభుత్వం కీలక ప్రకటన..!

తెలంగాణలో బక్రీద్ సెలవు మార్పు..ప్రభుత్వం కీలక ప్రకటన..!

Published on

spot_img

తెలంగాణలో బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) సెలవు తేదీని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మార్చింది. ముందుగా విడుదల చేసిన ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం మే 27, 2026న బక్రీద్ సెలవు ప్రకటించారు. అయితే హైదరాబాద్ నగరంలో నెలవంక కనిపించకపోవడంతో ముస్లిం పెద్దలు, సదర్ మజ్లిస్-ఎ-ఉలమా-ఎ-దక్కన్ సంస్థ బక్రీద్ పండుగను మే 28వ తేదీ (గురువారం) జరుపుకోవాలని నిర్ణయించారు. తాజా నిర్ణయంతో ఆ సెలవును మే 28, 2026కు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ వక్ఫ్ బోర్డు, మైనారిటీ సంక్షేమ శాఖల నుంచి వచ్చిన సూచనలు, సిఫారసులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్-1881 ప్రకారం మే 28వ తేదీ సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు విడుదల చేశారు.

ఈ మార్పు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకి, విద్యాసంస్థలకి, బ్యాంకులకి వర్తిస్తుంది అని అధికారులు స్పష్టం చేశారు. ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ధూల్-హిజ్జా నెల ప్రారంభం చంద్ర దర్శనం పై ఆధారపడి ఉంటుంది. మే 17వ తేదీన (ఆదివారం) సాయంత్రం రాష్ట్రంలో ఎక్కడా చంద్రదర్శనం కాలేదు. దీంతో ధుల్-ఖాదా నెల 30 రోజులు పూర్తయి, మే 19వ తేదీ మంగళవారం నుండి ధుల్-హిజ్జా మాసం ప్రారంభమైంది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.