తెలంగాణ రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు మరియు దివ్యాంగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. అర్హులైన మరో 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు.
ఈ పెన్షన్ల పథకం అమలు కోసం రాష్ట్ర బడ్జెట్‌లో ₹14,861 కోట్లు ప్రతిపాదించారు. ప్రస్తుతం ‘చేయూత’ పథకం కింద అర్హులకు నెలకు ₹2,000 పెన్షన్ అందుతోంది. దివ్యాంగులకు ప్రభుత్వం నెలకు ₹4,000 పెన్షన్ అందజేస్తోంది.


