HomeWarangal Newsతెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు గుండె చికిత్స!

తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు గుండె చికిత్స!

Published on

spot_img

తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు గుండె చికిత్స :

తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో గవర్నర్ గుండెలో బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించి స్టెంట్ అమర్చినట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో గవర్నర్ చికిత్స పొందుతున్నారు.

నిలకడగా ఆరోగ్యం:

స్టెంట్ అమర్చిన అనంతరం శివప్రతాప్ శుక్లా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గవర్నర్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.

గవర్నర్‌ను పరామర్శించిన సీఎం:

శివప్రతాప్ శుక్లాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యశోదా ఆస్పత్రిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తదితరులు కూడా ఆస్పత్రికి చేరుకుని గవర్నర్‌ను పరామర్శించారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles