HomeLatest Newsవిద్యార్థులకు ఊరట: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి నెల మూడో శనివారం 'నో బ్యాగ్ డే'

విద్యార్థులకు ఊరట: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి నెల మూడో శనివారం ‘నో బ్యాగ్ డే’

Published on

spot_img

తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యాశాఖ తీపి కబురు అందించింది. విద్యార్థులపై పుస్తకాల భారాన్ని తగ్గించి, మానసిక వికాసానికి ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రతి నెలా మూడో శనివారాన్ని ‘నో బ్యాగ్ డే’గా నిర్వహించాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదికి మొత్తం 10 రోజులను ఈ కార్యక్రమానికి కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయాన్ని 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ వర్తింపజేయనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి ‘నో బ్యాగ్ డే’ నిర్వహించే తేదీలను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 19, నవంబర్ 21, డిసెంబర్ 19, ఫిబ్రవరి 20 మరియు మార్చి 20వ తేదీలను నిర్ణయించారు.

ఈ ప్రత్యేక రోజుల్లో విద్యార్థులు పాఠ్యపుస్తకాలు తేనక్కర్లేదు. పుస్తకాలకు బదులుగా ఆటపాటలు, శాస్త్రీయ ప్రయోగాలు, విహారయాత్రలతో పాటు సరికొత్త నైపుణ్యాలను నేర్పించాలని ఉపాధ్యాయులకు విద్యాశాఖ సూచించింది. దీనివల్ల విద్యార్థులలో సృజనాత్మకత పెరగడమే కాకుండా చదువుపై ఆసక్తి పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.