తెలంగాణ రాష్ట్రాన్ని భానుడు ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాడు. రోజురోజుకి పెరుగుతున్న ఎండల తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా.. ఖమ్మం, వరంగల్, నలగొండ జిల్లాలకు నేడు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వేడి గాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటకు అస్సలు రావద్దని.. బయటకు రావడం చాలా చాలా ప్రమాదకరమని సూచిస్తున్నారు.

19 జిల్లాల్లో 46 డిగ్రీల సెల్సియస్ కు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి అని సమాచారం. అత్యధిక ఉష్ణోగ్రత నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో నమోదయింది.
అక్కడ 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వడదెబ్బ ప్రభావం కూడా రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తుంది.
ఒక్కరోజే దాదాపు 11 మంది వరకు వడదెబ్బతో మృతి చెందినట్లు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అత్యవసరమైతే తప్ప పగటిపూట బయటకు రానే రావద్దు అని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తగినంత నీరు త్రాగడం, పలుచటి దుస్తులు ధరించడం, నేరుగా ఎండలో ఎక్కువసేపు ఉండకపోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.
రాష్ట్రంలో మరికొన్ని రోజులపాటు ఎండల తీవ్రత కొనసాగవచ్చు అని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.
Read Warangal News and Latest Politics News and Real Estate


