తెలంగాణలో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ (ICET-2026) పరీక్షకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 రీజినల్ సెంటర్లలో 69 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఐసెట్ పరీక్షకు మొత్తం 56,223 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
అభ్యర్థులు నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడరు. కాబట్టి నిర్ణీత సమయం కంటే ముందే చేరుకోవడం ఉత్తమం.
హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఒక గుర్తింపు కార్డును (Aadhar/Voter ID) వెంట తీసుకెళ్లాలి. పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లకు అనుమతి లేదు.


