తెలంగాణలో భూముల బూమ్.. ఒక్కసారిగా పెరగిన మార్కెట్ విలువలు..ఎక్కడ ఎంత పెరిగిందంటే..?
రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువల పెంచేసిన ప్రభుత్వం :
తెలంగాణలో భూములు, ఫ్లాట్లు, అపార్ట్‌మెంట్ల మార్కెట్ విలువలను రాష్ట్ర ప్రభుత్వం పెంచేసింది. రిజిస్ట్రేషన్ శాఖ పంపిన కొత్త విలువల ప్రతిపాదనను ప్రభుత్వం ఓకే చేసింది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆస్తుల కొనుగోలు, విక్రయాల ఖర్చులు పెరిగిపోయాయి. ఇకపై రాష్ట్రంలోని 144 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే అన్ని రిజిస్ట్రేషన్లు కొత్త విలువల ఆధారంగానే నిర్వహించనున్నారు.
ప్రస్తుతం అమలులో ఉన్న మార్కెట్ విలువలు కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలకు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఆకారణంగానే మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా భూముల విలువలను పెంచిన్నట్లు తెలుస్తుంది.
ఎక్కడ ఎంత పెరుగుదల?
ప్రభుత్వ లెక్కల ప్రకారం వ్యవసాయ భూముల ధరలు 50 శాతం నుంచి 100 శాతం పెరిగింది. అపార్ట్‌మెంట్ల మార్కెట్ విలువల్లో 10 నుంచి 20 శాతం వరకు పెరిగింది.
ప్రధాన నగరాల్లో వ్యవసాయ భూముల కొత్త ధరలు:
కొన్ని ముఖ్య ప్రాంతాల్లో ఎకరానికి వ్యవసాయ భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి.
- బుద్వేల్ లో ప్రస్తుతం రూ.5.5 కోట్లుగా ఉన్న విలువ రూ.8.25 కోట్లకు చేరింది.
- కొంగరకలాన్‌లో రూ.15 లక్షల నుంచి కనిష్టంగా రూ.30 లక్షల వరకు, గరిష్టంగా రూ.60 లక్షల వరకు పెరిగింది.
- హయత్‌నగర్‌లో రూ.11 కోట్ల నుంచి రూ.18 కోట్లకు పెరిగింది.
- రాయదుర్గంలో రూ.9 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు, కొన్ని ప్రాంతాల్లో రూ.20 కోట్ల వరకు పెరిగింది.
- నాగోల్‌లో ప్రస్తుతం ఉన్న రూ.6 కోట్ల విలువ రూ.7.5 కోట్లకు పెరిగింది.
వ్యాపార, నివాస స్థలాలపై ప్రభావం:
వ్యవసాయ భూములతో పాటు వాణిజ్య, నివాస అవసరాల భూముల విలువల్లో కూడా గణనీయమైన పెరుగుదల కనిపించింది.
- బుద్వేల్‌లో ఎకరానికి రూ.2.25 లక్షల నుంచి రూ.3.93 లక్షల వరకు పెంచేశారు.
- మిర్యాలగూడలో రూ.4.5 లక్షల నుంచి రూ.6.75 లక్షలకు పెంచేశారు.
- కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.25 లక్షల నుంచి రూ.6.03 లక్షలకు పెంచేశారు.
- నిజామాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో రూ.2.25 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచేశారు.
*హనుమకొండ : పాత మార్కెట్ విలువ: సుమారు ₹5,800 ప్రతి చదరపు గజం..కొత్త మార్కెట్ విలువ: సుమారు ₹8,700 ప్రతి చదరపు గజం
కొన్ని ప్రాంతాల్లో గరిష్ట మార్కెట్ విలువలు కూడా భారీగా పెరిగిపోయాయి. దీంతో రియల్ ఎస్టేట్ రంగంపై దీని ప్రభావం స్పష్టంగా కనిపించనుంది.
హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్ ధరల పెంపు:
హైదరాబాద్ నగరంలోని అపార్ట్‌మెంట్ల మార్కెట్ విలువల్లో కూడా పెరుగుదల:
- అజంపురాలో చదరపు గజానికి రూ.2,500 నుంచి రూ.2,700.
- మాసబ్‌ట్యాంక్‌లో రూ.2,500 నుంచి రూ.2,700.
- అంబర్‌పేట్‌లో రూ.1,300 నుంచి రూ.1,600.
- మంకల్, మొయినాబాద్, కొంపల్లి ప్రాంతాల్లో రూ.2,200 నుంచి రూ.2,700.
- బాలానగర్, పటాన్‌చెరు ప్రాంతాల్లో రూ.2,500 నుంచి రూ.3,000 వరకు పెరిగాయి.
ప్లాట్ల ధరల్లోనూ భారీ మార్పులు:
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్లాట్ల మార్కెట్ విలువల్లో కూడా భారీ పెంపు:
*కోకాపేట్‌లో చదరపు గజానికి రూ.23,800 నుంచి రూ.47,600.
*అత్తాపూర్‌లో రూ.20,300 నుంచి రూ.30,500.
*కొంపల్లిలో రూ.11,600 నుంచి రూ.17,400.
*హయత్‌నగర్‌లో రూ.5,800 నుంచి రూ.8,700.
*కాజీపేటలో రూ.9,500 నుంచి రూ.14,250 వరకు పెరిగాయి.
కొనుగోలుదారులపై అదనపు భారం:
కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రావడంతో భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల కొనుగోలు ఖర్చు పెరిగింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నవారికి కూడా కొత్త విలువలే వర్తిస్తాయి. అదనంగా చెల్లించాల్సిన మొత్తాన్ని భూ భారతి పోర్టల్ ద్వారా చెల్లించే అవకాశం కల్పించారు. ప్రజల సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు టోల్ ఫ్రీ నంబర్ 1800 599 4788, వాట్సాప్ నంబర్ 82476 19983లను అందుబాటులో ఉంచారు. కొత్త మార్కెట్ విలువల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఆదాయం పెరగనుండగా, మరోవైపు భూములు, ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసే వారికి అదనపు భారం తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


