7,437 పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తుల షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 19 నుంచి అప్లికేషన్లు ప్రారంభం:
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర పోలీస్ శాఖలో మొత్తం 7,437 ఖాళీల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల షెడ్యూల్ను తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 19 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత గడువు తర్వాత వచ్చే దరఖాస్తులను అధికారులు స్వీకరించరని స్పష్టం చేశారు.
పోస్టుల ఆధారంగా దరఖాస్తు ఫీజులు:
అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్న పోస్టును బట్టి పరీక్ష ఫీజులు వేర్వేరుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600 లేదా రూ.750, ఇతర వర్గాల అభ్యర్థులకు రూ.1,200 లేదా రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. ఏ పోస్టుకు ఎంత ఫీజు వర్తిస్తుందనే పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో అందుబాటులో ఉంటాయని బోర్డు తెలిపింది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులకు కూడా బోర్డు ఊరటనిచ్చింది. అదనపు పోస్టులకు దరఖాస్తు చేసే సమయంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50, ఇతర అభ్యర్థులకు రూ.100 చొప్పున ఫీజులో మినహాయింపు కల్పించనున్నట్లు వెల్లడించింది. దీంతో అర్హత ఉన్నవారు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
నోటిఫికేషన్ను జాగ్రత్తగా పరిశీలించాలి:
దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు వయోపరిమితి, విద్యార్హతలు, ఎంపిక విధానం, పరీక్ష తేదీలు, ఫిజికల్ టెస్టులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వంటి పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలని అధికారులు సూచించారు. అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకుని, చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులకు కీలక అవకాశంగా మారింది. పూర్తి వివారాల కోసం https://www.tgprb.in/ ఈ లింక్ ని క్లిక్ చేయండి..!!


