తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఎట్టకేలకు ముగిసింది. ప్రభుత్వంతో నిర్వహించిన చర్చలు సఫలం కావడంతో కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.
కార్మికులకు 11 శాతం పీఆర్‌సీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీలో అటు ప్రభుత్వ అధికారులు, ఇటు ఆర్టీసీ కార్మికులు సభ్యులుగా ఉంటారు.

ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు తక్షణమే చర్యలు చేపట్టాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ అయ్యాయి.
కార్మికుల ఇతర చిన్న చిన్న సమస్యలను ఆర్టీసీ యాజమాన్యమే పరిష్కరించేలా నిర్ణయం తీసుకున్నారు.


