హైదరాబాద్:తెలంగాణలో విద్యా రంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) నేడు రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల బంద్కు పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థ రోజురోజుకూ నిర్వీర్యమవుతోందని, పాలకుల తీరు చూస్తుంటే ప్రభుత్వమే ప్రైవేట్ పాఠశాలలకు బ్రాండ్ అంబాసిడర్గా మారినట్లు అనిపిస్తోందని ABVP నేతలు మండిపడ్డారు.
సర్కారు బడులను మూసివేయడానికి (ఎత్తివేతకు) ముఖ్యమంత్రి కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్షణమే విద్యా రంగంలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ABVP ప్రధాన డిమాండ్లు ఇవే:
- ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులను కల్పించాలి.
- ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.
- ప్రైవేట్ పాఠశాలల్లో దోపిడీని అరికట్టేందుకు ‘ఫీజుల నియంత్రణ చట్టాన్ని’ కఠినంగా అమలు చేయాలి.


