తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల (SFI, AISF, PDSU, AIFDS, AISB, AIPSU) ఆధ్వర్యంలో నేడు రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి నేతలు భారీ ‘విద్యార్థి మహా ప్రదర్శన’ నిర్వహించారు. విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాల నేతలు కోరడంతో, ఇప్పటికే పలు ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలు ఇవాళ సెలవు ప్రకటిస్తూ తల్లిదండ్రులకు సందేశాలు (మెసేజ్‌లు) పంపాయి.
రేపు స్కూళ్లు యధావిధిగా పనిచేస్తాయి
సాధారణంగా నెలలో వచ్చే రెండో శనివారం విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. అయితే, రేపు (జులై 11) రెండో శనివారం అయినప్పటికీ పాఠశాలలు యధావిధిగా తెరిచి ఉంటాయని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ఈ ఏడాది ఎండల తీవ్రత కారణంగా సమ్మర్ హాలిడేస్ (వేసవి సెలవులు) పొడిగించిన సంగతి తెలిసిందే. ఆ సెలవులను భర్తీ చేసేందుకు వీలుగా జులై 11న వర్కింగ్ డేగా ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు ఇవాళ బంద్ కారణంగా సెలవు ఉన్నప్పటికీ, రేపు శనివారం పాఠశాలలు యధావిధిగా నడుస్తాయనే విషయాన్ని గమనించగలరు.
Read Warangal News and Latest Politics News and Real Estate

