HomeLatest Newsచరిత్ర తిరగరాసిన తెలంగాణ..ట్రాన్స్‌జెండర్ మహిళకు CMRF ఆర్థిక సహాయం..!

చరిత్ర తిరగరాసిన తెలంగాణ..ట్రాన్స్‌జెండర్ మహిళకు CMRF ఆర్థిక సహాయం..!

Published on

spot_img

చరిత్ర తిరగరాసిన తెలంగాణ..ట్రాన్స్‌జెండర్ మహిళకు CMRF ఆర్థిక సహాయం :

ట్రాన్స్‌జెండర్‌ల సంక్షేమం ఆరోగ్య హక్కుల పరిరక్షణలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఓ ట్రాన్స్జెండర్ మహిళకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం విశేషంగా నిలిచింది. బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ శాస్త్ర చికిత్స కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిధులు విడుదలైనట్లు అధికారులు తెలిపారు.

ట్రాన్స్‌జెండర్‌ల ఆరోగ్య అవసరాలను గుర్తించి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని LGBTQ+ సమాజ ప్రతినిధులు స్వాగతించారు. సమాన అవకాశాలు. గౌరవప్రద జీవనం, ఆరోగ్య హక్కుల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని క్వీర్ బందు పేరెంట్స్ అసోసియేషన్ పేర్కొంది.

శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తికావడంతో అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ వేముల శ్రీనివాస్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చర్య ట్రాన్స్‌జెండర్‌ల సాధికారతకు దోహదపడటమే కాకుండా, సమాజంలో వారికి మరింత గౌరవం, గుర్తింపు తీసుకురావడంలో కీలకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

LGBTQ+ సమాజ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సందేశాన్ని ఈ నిర్ణయం మరోసారి స్పష్టం చేసింది. ట్రాన్స్‌జెండర్‌ల హక్కుల పరిరక్షణ దిశగా ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.