రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలపాతాలు, రిజర్వాయర్ల వద్ద వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నీటిపారుదల శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. జలపాతాలు, రిజర్వాయర్ల వద్ద పర్యాటకుల సందర్శనను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రమాదకర స్థాయిలో జలపాతాల ప్రవాహం
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల వద్ద వరద ఉద్ధృతి ప్రమాదకర స్థాయికి చేరింది.
కుంటాల, గుండాల, పొచ్చెర జలపాతాలు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయి. ప్రసిద్ధ బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చుట్టుపక్కల ప్రాంతాలు జలమయం అయ్యాయి.
గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక
మరోవైపు గోదావరి నదిలో నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో అధికారులు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు.
జలపాతాలు, ప్రాజెక్టులు మరియు రిజర్వాయర్ల సమీపానికి పర్యాటకులు ఎవరూ వెళ్లకుండా అధికారులు కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

