తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి Revanth Reddy ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అమలవుతున్న అన్ని ప్రభుత్వ పథకాల కోసం ఇకపై ఫేస్ రికగ్నిషన్ విధానం తప్పనిసరి చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఖచ్చితంగా గుర్తించడం, అవినీతి మరియు అక్రమాలను నివారించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇకపై వివిధ సంక్షేమ పథకాల అమలులో ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా లబ్ధిదారుల గుర్తింపు నిర్వహించనున్నారు.


