వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పోలీసులు ఆలయ చోరీ కేసును కేవలం 24 గంటల్లోని విజయవంతంగా చేధించారు.
ఈ ఘటనలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి చోరీకి సంబంధించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం ప్రాంతానికి చెందిన కల్లకూరి కిరణ్ బాబు మరియు అనంతపురం జిల్లాకు చెందిన సందీప్ కుమార్ గా గుర్తించారు.
వీరిద్దరూ ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఆత్మకూరు మండలం గూడెప్పాడు గ్రామంలోని ఆలయంలోకి చొరబడి వెండి సామాగ్రిని దోచుకెళ్లారు.
ఈ ఘటనపై ఆలయ నిర్వహకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.
అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితులను గుర్తించిన పోలీసులు మరుసటి రోజు ఉదయం ఆత్మకూరు మండల కేంద్రంలో వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఇద్దరినీ పట్టుకున్నారు.
వారిద్దరి నుంచి సుమారు రెండు లక్షల 40 వేల రూపాయలు విలువైన 1080 గ్రాముల వెండి వస్తువులు అలాగే ఒక కారుని స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో కిరణ్ బాబు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో కలిపి 50 కి పైగా చోరీ కేసుల్లో పాల్గొన్నట్లు తెలిసింది.
24 గంటల్లోనే కేసును చేధించి సొత్తును రికవరీ చేసిన ఆత్మకూరు పోలీసులను పరకాల ఏసీపీ సతీష్ బాబు అభినందించారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


