తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రేపు (మే 4న) మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు.
ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, వారి డిమాండ్లపై క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
పెండింగ్లో ఉన్న సుమారు 14 వేల కోట్ల రూపాయల బిల్లులను క్లియర్ చేసే విషయంపై చర్చించనున్నారు.
మే 5 నుండి సమ్మెకు దిగుతామని ఉద్యోగ JAC ప్రకటించిన నేపథ్యంలో, ఆ అంశంపై ప్రభుత్వం ఈ భేటీలో ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.


