TG MeeSeva ద్వారా లక్షల మందికి లాభం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సులభంగా సేవలు అందించేందుకు ప్రారంభించిన వాట్సాప్ మీ సేవ (TG MeeSeva WhatsApp Service) భారీ స్పందన పొందుతోంది.
ఈ సేవ ద్వారా ఇప్పటివరకు 4.5 లక్షల మందికి పైగా పౌరులు ప్రభుత్వ సేవలను వినియోగించుకున్నారు.
వాట్సాప్ వేదికగా ప్రస్తుతం 581 రకాల ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఇందులో ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలు, విద్యుత్ బిల్లు, నీటి బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్, పోలీస్ చలాన్లు, పెన్షన్ వివరాలు, లైసెన్సులు, ఇతర అనేక ప్రభుత్వ సేవలు ఉన్నాయి.
ఈ సేవ ప్రారంభమైనప్పటి నుంచి 3.25 లక్షలకుపైగా డిజిటల్ లావాదేవీలు విజయవంతంగా పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు.
ప్రజలు ఎటువంటి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే ప్రభుత్వ సేవలు పొందగలుగుతున్నారు.
వాట్సాప్ మీ సేవను ఉపయోగించేందుకు 8096958096 నంబర్‌కు “HI” అని మెసేజ్ పంపితే సరిపోతుంది.
ఆ తర్వాత అవసరమైన సేవను ఎంపిక చేసుకుని తక్షణమే వివరాలు పొందవచ్చు.
డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణ మరో ముందడుగు వేసిందని అధికారులు పేర్కొన్నారు.


