HomeLatest NewsTG పాలిసెట్-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ప్రవేశాల ప్రక్రియకు తేదీలు ఖరారు

TG పాలిసెట్-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ప్రవేశాల ప్రక్రియకు తేదీలు ఖరారు

Published on

spot_img

TG పాలిసెట్-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల:

టీజీ పోలిసెట్ 2026లో అర్హత సాధించిన విద్యార్థులకు పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల ప్రవేశాల కోసం కౌన్సిలింగ్ షెడ్యూల్ ని అధికారులు విడుదల చేశారు. మొదటి దశ, ఫైనల్ ఫేస్, ఇంటర్నల్ స్లైడింగ్ కు సంబంధించిన పూర్తి తేదీలను ప్రకటించారు. విద్యార్థులు నిర్ణిత గడువుల్లో ఫీజు చెల్లింపు. సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ నమోదు వంటి ప్రక్రియలను పూర్తి చేయాలి అని అధికారులు సూచించారు.

మొదటి దశ కౌన్సిలింగ్ షెడ్యూల్:

మొదటి దశలో ఆన్లైన్ ఫీజు చెల్లింపు మరియు స్లాట్ బుకింగ్ ప్రక్రియ మే 27 నుంచి మే 31 2026 వరకు కొనసాగుతుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను మే 29 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నారు.

విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ను మే 29 నుంచి జూన్ 3 వరకు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆప్షన్స్ ఫ్రీజింగ్ జూన్ 3న నిర్వహించబడుతుంది. సీట్ల కేటాయింపు జూన్ 6 లోపు పూర్తి చేయనుండగా ఎంపికైన అభ్యర్థులు జూన్ 6 నుంచి 9 వరకు ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.

అలాగే కాలేజీలలో ప్రత్యేక రిపోర్టింగ్ జూన్ 8 మరియు 9 తేదీల్లో జరగనుంది.

ఫైనల్ ఫేజ్ వివరాలు:

ఫైనల్ ఫేజ్ లో స్లాట్ బుకింగ్ జూన్ 15న నిర్వహించనున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ జూన్ 16న జరుగుతుంది. అదే రోజు నుంచి జూన్ 17 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.

ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు జూన్ 20 లోపు ప్రకటించనుండగా.. ఎంపికైన విద్యార్థులు జూన్ 22 మరియు 23 తేదీల్లో కాలేజీలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ఇంటర్నల్ స్లైడింగ్ :

ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియను జూన్ 27 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు అధికారిక షెడ్యూల్ ని పరిశీలించి నిర్ణీత తేదీల్లో అవసరమైన ప్రక్రియలను పూర్తి చేయాలి అని సూచించారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

AI 80’s ఫోటో ట్రెండ్‌పై నిపుణుల హెచ్చరిక.. ఫోటోలు అప్‌లోడ్ చేసే ముందు జాగ్రత్త!

AI టూల్స్‌తో 1980ల నాటి ఫోటోల తరహాలో చిత్రాలను మార్చుకునే ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వ్యక్తిగత ఫోటోలను AI ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసే ముందు ప్రైవసీ, డేటా భద్రతపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బిగ్ బాస్ హోస్టుల రెమ్యునరేషన్.. ఒక్కో సీజన్‌కు కోట్లలో పారితోషికం!

బిగ్ బాస్ షోకు హోస్టులుగా వ్యవహరించిన ప్రముఖ నటులు, సెలబ్రిటీలకు భారీగా పారితోషికం అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో సీజన్‌కు ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసుకోవాలంటే ఈ వివరాలు చూడాల్సిందే.

అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి ప్రశంసలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) సామాజిక బాధ్యతలో భాగంగా కీలక కార్యక్రమం చేపట్టింది. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది బాలికలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

నిద్రలో పదేపదే మేల్కొంటున్నారా? మీ శరీరం చెప్తుందే ఇదే..!

రాత్రిపూట నిద్రలో పదేపదే మెలకువ రావడానికి ఒత్తిడి, ఆందోళన, కెఫిన్, గది వాతావరణం వంటి కారణాలు ఉండొచ్చు. అయితే గురకతో పాటు శ్వాస ఆగడం, పగటిపూట అధిక నిద్రమత్తు ఉంటే స్లీప్ అప్నియా సంకేతాలు కావచ్చు.
spot_img

Related Articles

విద్యార్థుల ఖాతాల్లోనే నేరుగా ఫీజు రీయింబర్స్ మెంట్: శాసనసభలో సీఎం కీలక ప్రకటన

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తెరదించారు.

AI 80’s ఫోటో ట్రెండ్‌పై నిపుణుల హెచ్చరిక.. ఫోటోలు అప్‌లోడ్ చేసే ముందు జాగ్రత్త!

AI టూల్స్‌తో 1980ల నాటి ఫోటోల తరహాలో చిత్రాలను మార్చుకునే ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వ్యక్తిగత ఫోటోలను AI ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసే ముందు ప్రైవసీ, డేటా భద్రతపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మెహందీ కళాకారుల ఉద్యోగాలకు ఎసరు? వైరల్ AI వీడియోతో కొత్త భయం!

మెహందీ ఆర్టిస్టుల పనిని సులభతరం చేసేలా కనిపిస్తున్న ఓ మెషీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా షేర్ చేసిన ఈ AI-generated వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.