2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రభుత్వం నుండి అధికారిక గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల జాబితాను విద్యాశాఖ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.
స్టేట్ సిలబస్, CBSE, లేదా ICSE.. ఇలా ఏ బోర్డు స్కూల్ అయినా సరే, వాటి గుర్తింపు స్టేటస్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవచ్చు.
అనధికారిక లేదా మోసపూరిత విద్యాసంస్థల బారిన పడకుండా ఉండేందుకు వెబ్‌సైట్‌ను సందర్శించి వివరాలు సరిచూసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
వివరాల కోసం schooledu.telangana.gov.in ను చూడవచ్చు.


