Rythu Bharosa Application Deadline 2026పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జూన్ 15 తర్వాత కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన రైతులు, రైతుభరోసా పథకం లబ్ధి పొందాలంటే జులై 5వ తేదీ లోపు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి.
సమర్పించాల్సిన పత్రాలు:
అర్హులైన రైతులు క్రింది పత్రాలతో దరఖాస్తు ఫారాన్ని పూర్తిగా నింపి, తమ పరిధిలోని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు (AEOలకు) సమర్పించాల్సి ఉంటుంది.
• ఆధార్ కార్డ్ జిరాక్స్
• కొత్తగా వచ్చిన పట్టా పాస్బుక్ జిరాక్స్
•బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్
అధికారుల హెచ్చరిక:
జులై 5వ తేదీ దాటిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించడం జరగదని, గడువు ముగిస్తే రైతులకు మరో అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జూన్ 30 నుంచి విడతల వారీగా నిధులు:
ఈ Rythu Bharosa Application Deadline 2026 నేపథ్యంలో అర్హులైన రైతులు వెంటనే చర్యలు తీసుకోవాలి. జూన్ 30 నుంచి ప్రభుత్వం విడతల వారీగా ప్రతి ఎకరానికి రూ. 6,000 చొప్పున నిధులను జమ చేయనుండగా, గడువు లోపు దరఖాస్తు చేసుకున్న వారికే ఈ ప్రయోజనం అందుతుంది.
FAQ’s
1. What is Rythu Bharosa Application Deadline 2026?
రైతులు పథకం లబ్ధి పొందడానికి దరఖాస్తు చేసుకోవాల్సిన చివరి తేదీ (జులై 5).
2. ఎవరు అప్లై చేయాలి?
జూన్ 15 తర్వాత కొత్తగా పట్టా పాస్బుక్ పొందిన రైతులు.
3. అవసరమైన పత్రాలు ఏమిటి?
ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్.
4. గడువు దాటితే ఏమవుతుంది?
దరఖాస్తు స్వీకరించరు, లబ్ధి కోల్పోతారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


